ఈ మధ్యకాలంలో ప్రేమ వ్యవహారాలు కాస్త విచిత్రంగానే కొనసాగుతున్నాయి. సాధారణంగా కొన్ని ప్రాంతాల్లో ఉండే సమీప అభ్యర్థులు ఎక్కువగా ప్రేమలో పడ్డారంటే ఏం లేదు.. కానీ ఇప్పుడు ఇతర రాష్ట్రాల వారిని ప్రేమించిన వారిని మనం చూస్తుంటాం. కానీ ఇతర దేశాల వారని ప్రేమించిన సంఘటనలు చాలా అరుదుగానే చోటు చేసుకుంటాయి.
కానీ ఈ మధ్య కాలంలో విదేశాల ప్రేమలు కాస్త ఎక్కువవుతున్నాయి. ప్రేమను కాదనలేక వారిని ఏం చేయలేకపోతున్నారు పోలీసులు. తాజాగా పాకిస్తాన్ కి చెందిన మహహ్మద్ ఫయాజ్ ని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్కు చెందిన యువతిని మహమ్మద్ ఫయాజ్ వివాహం చేసుకున్నాడు. యువతి ప్రెగ్నెన్సీ కావడంతో ఆమెను చూసేందుకు పాకిస్తాన్ నుంచి నేపాల్ మీదుగా హైదరాబాద్ చేరుకున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు ఫయాజ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫయాజ్.. దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నాడు.