చెస్ చాంప్ ప్రజ్ఞానంద్ కు ప్రధాని మోదీ ప్రశంసలు

-

ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్​ ముగించుకొని భారత్​కు వచ్చిన ప్రజ్ఞానందకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు అందరూ ఈ చెస్ ఛాంప్​కు జేజేలు పలుకుతున్నారు. తాజాగా గ్రాండ్​ మాస్టర్​ ప్రజ్ఞానంద గురువారం రోజున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశాడు. తన కుటుంబ సభ్యులతో పాటు దిల్లీకి వెళ్లిన ప్రజ్ఞానంద.. మోదీతో కాసేపు ముచ్చటించాడు.

ఆ తర్వాత తాను గెలిచిన రజత పతకాన్ని మోదీకి చూపించాడు. అనంతరం మోదీ.. ప్రజ్ఞానంద ఫ్యామిలీతో సరదాగా గడిపారు. ఈ విషయాన్ని ప్రజ్ఞానంద ఎక్స్​(ట్విటర్)​లో పోస్ట్​ చేశారు. ” ప్రధాని మోదీని వారి ఇంటికెళ్లి కలవడం సంతోషంగా ఉంది. నాతో పాటు నా తల్లిదండ్రులను ప్రోత్సహించినందుకు థ్యాంకూ సర్” రాసుకొచ్చారు ప్రజ్ఞా.

ఈ ట్వీట్​ను మోదీ రీ ట్వీట్ చేస్తూ.. ” 7, లోక్ కల్యాణ్ మార్గ్​కు స్పెషల్ విజిటర్స్ వచ్చారు. ప్రజ్ఞానందను అతడి తల్లిదండ్రులను కలుసుకోవడం ఆనందంగా ఉంది. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని భారతదేశ యువతకు ఉదాహరణగా నిలిచాడు. నీ పట్ల గర్వంగా ఉంది” అని మోదీ ప్రజ్ఞాను ప్రశంసల్లో ముంచెత్తారు.

Read more RELATED
Recommended to you

Latest news