బిగ్‌బాస్ 3 రియాల్టీ షోకు తెరపడింది. ఆదివారం ఈ షోకు ముగింపు పలికారు బిగ్‌బాస్ 3 నిర్వహకులు. స్టార్ మా టీవీలో 105 రోజుల పాటు ఎంతో ఆసక్తికరంగా, జనరంజకంగా, అనేక ట్వీస్ట్‌లతో, రకరకాల గేమ్‌లతో సాగిన బిగ్‌బాస్ 3 విజేతగా పాపులర్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్, రన్నర్‌గా శ్రీముఖి నిలిచారు. బిగ్‌బాస్ 3కి ప్రముఖ టాలీవుడ్ నటుడు, కింగ్ అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహించారు. బిగ్‌బాస్ రెండు సీజన్లకు భిన్నంగా తనదైన శైలీలో మీలో ఎవరు కోటిశ్వరుడు అనే అనుభవంతో బిగ్‌బాస్ 3ని నాగార్జున నిర్వహించిన తీరుతో ప్రపంచంలోనే బిగ్గెస్ట్ హిట్ అయింది.
అయితే 17మంది కంటెస్టంట్లో చివరికి రోజున కేవలం ఐదుగురు మాత్రమే మిగిలారు. విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, రన్నరర్ శ్రీముఖీతో పాటు ప్రముఖ కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్, ప్రముఖ టీవీ నటుడు అలీ రెజా, టాలీవుడ్ నటుడు వరుణ్ సందేశ్‌లు చివరి దశకు చేరుకున్నారు. గ్రాండ్ ఫినాలేకు ఈ ఐదుగురు ఎంపిక కాగా ఇందులో అలీ రెజా, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్‌లు ఎలిమినేట్ అయ్యారు. దీంతో రాహుల్, శ్రీముఖీ ఫైనల్ లో నిలిచారు. వీరిలో రాహుల్ టైటిల్ విన్నర్‌గా నిలవడంతో బిగ్‌బాస్ 3కు ముగింపు అయింది.
అయితే నటుడు వరుణ్ సందేశ్ బిగ్‌బాస్ హౌస్‌లోకి తాను ఒక్కడే కాకుండా తన జీవిత భాగస్వామి అయిన వితికా తో కలిసి వెళ్ళారు. వరుణ్ సందేశ్ భార్య వితిక చివరి దశలో ఎలిమినేట్ కావడం, వరుణ్ సందేశ్ మాత్రం ఫైనల్ వరకు రావడం విశేషం. బిగ్‌బాస్ హౌస్‌లో వరుణ్ సందేశ్ బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లను కూల్‌గా చేసుకుపోయారు. బిగ్‌బాస్ హౌస్‌లో తన పోటీదారులతో ఆయన వ్యవహరించిన తీరుతో అంతా రచ్చ రచ్చ అయిన సందర్భాలు అనేకం. తన భార్యతో ఇతర పోటీదారులు వ్యవహరిస్తున్న తీరుకు నొచ్చుకుని, వారితో ఘర్షణ పడి, బిగ్‌బాస్ లో ఆసక్తి నెలకొనేలా చేశారు. చివరికి బిగ్‌బాస్ వ్యాఖ్యాత నాగార్జునతో చివాట్లు తినడం, తిరిగి ఎలిమినేషన్ వరకు వెళ్ళడం, తృటిలో తప్పించుకోవడం వంటివి జరగడంతో అసలు బిగ్‌బాస్ హౌస్‌లో ఏమీ జరుగుతుందో అనే ఉత్కంఠ రేకెత్తించారు
వరుణ్ సందేశ్. వాస్తవానికి వరుణ్ సందేశ్ కపుల్స్ బిగ్‌బాస్ రియాల్టీ షోను ఓ ఉత్కంఠ బరితమైన సినిమాగా మలచడంతో విజయం సాధించారనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇక వరుణ్ సందేశ్ ఈ హౌస్‌లో ఆడిన తీరు ఆకట్టుకోవడంతో ఆయనను ప్రేక్షకులు చివరిదాకా తీసుకురాగలిగారు. కానీ పాపం ఫైలన్లో ఎలిమినేట్ అయ్యారు. తొలి నుంచి వరుణ్‌కు మంచి మార్కులే ఉన్నా చివర్లో భార్య వితిక కోసం ఆడిన సేఫ్ గేమ్ నేపథ్యంలో మనోడు న్యూట్రల్ ఓటర్లలో నెగిటివ్ అయ్యాడు. వరుణ్ సందేశ్ జూలై 21, 1989లో జన్మించారు. టాలీవుడ్ పరిశ్రమలోకి 2007లో ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన హ్యాపీ డేస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి తన నటనతో మెప్పించారు.
తరువాత వరుసగా కొత్తబంగారు లోకం, ఎవ్వరైనా ఎప్పుడైనా, కుర్రోడు, మరో చరిత్ర, హ్యాపీ హ్యాపీగా, ఏమైందీ ఈ వేళ, కుదిరితే కప్పు చాయ్, బ్రహ్మిగాడీ కథ, ప్రియుడు, చమ్మక్ ఛలో, ప్రియతమా నీవచ్చ కుశలమా, సరదాగా అమ్మాయితో, అబ్బాయ్ క్లాస్, అమ్మాయి మాస్, ఢీ ఫర్ దోపిడీ, నువ్వలా నేనిలా, పాండవులు పాండవులు తుమ్మెదా, పెద్దనంది ప్రేమలో మరి, మామ మంచు అల్లుడు కంచు, లవకుశ, మిస్టర్ 420, మర్ల పులి వంటి సినిమాల్లో నటించారు. 2016లో వితికాను పెండ్లి చేసుకున్న వరుణ్ సందేశ్ కు ఇప్పుడు సినిమాలు అంతగా లేవనే చెప్పాలి.