తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..ఈ నెల 18వ తేదీ నుంచి తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ మేరకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ నెల 22వ తేదిన గరుడ వాహన సేవ, 23వ తేదిన స్వర్ణరథ ఉరేగింపు, 26వ తేదీన చక్రస్నానం నిర్వహిస్తారు. ఇక సెప్టెంబర్ లో తిరుమలలో విశేష పర్వదినాలు జరుగనున్నాయి.
కలియుగ వైకుంఠమైన తిరుమలలో సెప్టెంబరు నెలలో విశేష పర్వదినాలు ఇలా ఉన్నాయి. సెప్టెంబరు 7న గోకులాష్టమి, సెప్టెంబరు 8న ఉట్లోత్సవం, సెప్టెంబరు 17న బలరామ జయంతి, వరాహ జయంతి, తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగనుంది. సెప్టెంబరు 18న వినాయక చవితి, ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. సెప్టెంబరు 22న శ్రీవారి గరుడసేవ ఉండనుంది.