చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. ఏసీబీ కోర్టులో చంద్రబాబు పై ఏపీ ప్రభుత్వం మరో పిటిషన్ దాఖలు చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో పీటీ వారెంట్ ఇచ్చింది. చంద్రబాబును విచారించాలని కోరిన ఏపీ ప్రభుత్వం…ఈ మేరకు మరో పిటిషన్ దాఖలు చేసింది. కాగా స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో బాబుకు రిమాండ్ విధించారు. 14 రోజుల పాటు రిమాండ్ కొనసాగనుంది.
ఈ మధ్యలో బెయిల్ వస్తుందా? ఏం జరుగుతుందా? అనేది పక్కన పెడితే..మొత్తానికి బాబు మాత్రం జైలుకెళ్లారు. అదే ఇప్పుడు వైసీపీ నేతలు, శ్రేణులు పండుగ చేసుకుంటున్నాయి. జగన్‌ని అక్రమంగా 16 నెలల పాటు జైల్లో పెట్టారని, ఇప్పుడు బాబుకు జైలు జీవితం అర్ధం అవుతుందని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. కాగా చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడంతో నగరంలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ఇవాళ టిడిపి రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సెక్షన్ 30 అమలు చేస్తున్నారు. అటు బాబుతో పాటు జామర్ వెహికల్, రెండు కార్లకు జైల్లోకి అనుమతిచ్చారు. హై ప్రొఫైల్ వ్యక్తి కావడంతో NSG బృందం జైల్లో కూడా ఆయనకు భద్రతగా ఉంది.