AP : ఇవాళ 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవం

-

ఏపీ విద్యార్థులకు అలర్ట్. ఇవాళ 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రారంభం కానున్నాయి. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు విజయనగరం మెడికల్ కాలేజీ ప్రాంగణం నుంచి వర్చువల్ గా ప్రారంభించనున్నారు సీఎం వై.ఎస్. జగన్. వచ్చే విద్యా సంవత్సరంలో మరో ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభం కానున్నాయి.

Inauguration of 5 Government Medical Colleges in AP today
Inauguration of 5 Government Medical Colleges in AP today

మొత్తం17 నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిర్మించనుంది ఏపీ ప్రభుత్వం. రూ. 8,480 కోట్ల వ్యయంతో 17 మెడికల్ కాలేజీల నిర్మాణం జరుగుతోంది. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య భారీగా పెరుగనుంది. ఇక ఇప్పటికే ఉన్న 2,185 ఎంబీబీఎస్ సీట్లకు అదనంగా మరో 2,550 ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయి. అటు  తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 9 మెడికల్ కాలేజీలను ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, భూపాలపల్లి, కుమ్రుం భీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగాం మెడికల్ కాలేజీల్లో.. ఈ విద్యాసంవత్సరం నుంచే తరగతులు ప్రారంభంకానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news