చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగుల గత మూడ్రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఇవాళ కూడా నిరసన చేపట్టాలని నిర్ణయించిన ఐటీ ఉద్యోగులకు పోలీసులు షాక్ ఇచ్చారు. వారి ఆందోళనలపై పోలీసులు ఆంక్షలు విధించారు. పోలీసుల అనుమతి లేకుండా ఐటీ కారిడార్ తోపాటు పరిసర ప్రాంతాల్లో ఎక్కడ ఆందోళనలు, ధర్నాలు చేసిన కఠిన చర్యలు తప్పవని మాదాపూర్ డీసీపీ సందీప్ హెచ్చరించారు.
ఈ మేరకు ఐటీ ఉద్యోగులు, తెలుదేశం నాయకులను ఉద్దేశిస్తూ ప్రకటన విడుదల చేసిన డీసీపీ…. సామాన్య ప్రజలకు, వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని డీసీపీ అన్నారు తెలుగుదేశం నాయకులతో కలిసి పలువురు ఐటీ ఉద్యోగులు ఇవాళ, రేపు ఆందోళనకు ప్రణాళిక చేసుకున్నారు. మణికొండలో సాయంత్రం 6 గంటలకు, నానక్ రాంగూడ ఓఆర్ఆర్ లో రేపు మధ్యాహ్నాం 1 గంట నుంచి కార్ ర్యాలీ, గచ్చిబౌలి ఐఐఐటీ జంక్షన్ లో నిరసనలకు సన్నాహాలు చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు… ఐటీ ఉద్యోగుల ఆందోళనలపై ఆంక్షలు విధించారు. ఆందోళనలు, ధర్నాల విషయాన్ని సామాజిక మాద్యమాల్లో షేర్ చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు.