మూడు రోజులుగా భార్య ఇంటి ముందు పడిగాపులు.. పట్టించుకోని భర్త..!

-

జగిత్యాల జిల్లాలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటి ముందు వేచి చూస్తున్న భార్యను ఓ భర్త ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకున్నారు. మూడు రోజులుగా ఇంటి ముందు పడిగాపులు కాస్తున్న ఆమెను అస్సలు పట్టించుకోలేదు. వివరాల్లోకి వెళ్లితే.. వరంగల్ జిల్లా ఆత్మకూరుకు చెందిన లావణ్యకు జగిత్యాలకు చెందిన గంగాధర్ తో 2017లో పెళ్లి జరిగింది.


వీరిద్దరీ మధ్య గత కొంత కాలం నుంచి కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. అదేవిధంగా వరకట్న వేధింపులతో భర్త గంగాధర్ వేధిస్తున్నాడని భార్య లావణ్య కేసు నమోదు చేసింది. వేధింపుల కేసులో జైలుకు వెళ్లిన గంగాధర్.. అనంతరం బెయిల్ పై బయటికి తిరిగి వచ్చాడు. బెయిల్ పై వచ్చిన భర్తలో మార్పు వచ్చిందేమోనని భావించిన భార్య లావణ్య తిరిగి అత్తారింటికి వచ్చింది. కానీ ఆమెను భర్త ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో ఇంటి ముందటే నిరీక్షీసతూ ఉండి పోయింది. లావణ్యకు గత మూడు రోజుల నుంచి ఇరుగు పొరుగు వారు అన్నం, పానీయాలు అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news