హైదరాబాద్, తమిళనాడులో ఎన్ఐఏ సోదాల కలకలం..!

-

జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహించింది. హైదరాబాద్, చెన్నై, కోయంబత్తూరులలో దాడులను నిర్వహిస్తోంది. ఇవాళ ఉదయం నుంచి హైదరాబాద్ నగరంలోని పాతబస్తీతో సహా ఓ నాలుగు చోట్ల ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈరోజు ఉదయం హైదరాబాద్ పాతబస్తీతో సహా నాలుగు చోట్ల ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించడం రాజధాని నగరంలో కలకలం రేపింది.

ఐఎస్ఐఎస్ సానుభూతిపరులుగా అనుమానిస్తున్న వారి నివాసాల్లో ఈ తనిఖీలు జరుగుతున్నట్లుగా సమాచారం. వివిధ సంస్థలుగా ఏర్పడి ఐఎస్‌లో పనిచేస్తున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. తమిళనాడు, హైదరాబాద్ లో జరిగిన సోదాలపై తాజాగా ఎన్ఐఏ ఓ ప్రకటన చేసింది. ముఖ్యంగా కోయంబత్తూరు పేలుళ్ల ఘటనపై ఎన్ఐఏ సోదాలు చేపడుతుంది. తమిళనాడు, హైదరాబాద్ లలో 28 చోట్ల సోదాలు నిర్వహించినట్టు తెలిపింది. అరబిక్ భాష పరిజ్ఞానం పేరుతో ఉగ్రవాద పాఠాలు నేర్పుతున్నారని గుర్తించింది. అదేవిధంగా వాట్సాప్, టెలీగ్రామ్ తో ఐఎస్ఐఎస్ వైపు యువతను మళ్లిస్తున్నట్టు గుర్తించారు. రూ.60లక్షలతో పాటు విదేశీ నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఎన్ఐఏ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news