ఈ మధ్యకాలంలో ఏనుగులు భలే బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో బీభత్సం సృష్టించిన ఘటన మరువక ముందే మహారాష్ట్రలో మరో భీభత్సాన్ని సృష్టించాయి. ఏనుగుల బారిన ప్రజలు, ఫారెస్ట్ అధికారులు ప్రాణాలు వదలాల్సి వస్తుంది. కాబట్టి ఏనుగుల విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ప్రాణాలను కోల్పేయే ప్రమాదముందని చాలా సంఘటనలు మనకు ఉదాహరణగా చెప్పవచ్చు.
తాజాగా మహారాష్ట్రలోని గడ్చిరొలి జిల్లాలో ఏనుగుల దాడిలో అటవీశాఖ ఉద్యోగి మృతి చెందాడు. డ్యూటికి వెల్లిన ఆత్రం హరిదాస్ (45) ను ఏనుగులు తొక్కి చంపాయి. తన వాహనంపై పడస్ గావ్ దొంగర్ గావ్ మార్గంలో తిరిగి వస్తుండగా ఏనుగుల గుంపు రహదారికి అడ్డుగా వచ్చి దాడి చేశాయి. దీంతో ఆ అధికారి అక్కడికక్కడే మరణించాడు. ఒడిశా రాష్ట్రం నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా మహారాష్ట్రలోకి ప్రవేశించింది ఈ ఏనుగుల గుంపు.గత కొద్దిరోజులుగా గడ్చిరోలి జిల్లాలోని ఆర్మోరి కుర్కేడా, ధనోర, దేశాయిగంజ్ తాలుకాల్లో గజరాజుల గుంపు కనిపిస్తుందని సమాచారం. ఆ ప్రాంతాల్లో పంట పొలాలను నాశనం చేస్తూ రైతులపై దాడి చేస్తుండటంతో అప్రమత్తం అయ్యారు టవీశాఖ అధికారులు.