చంద్రబాబు సంతకాలు పెట్టారు కాబట్టే అరెస్ట్ చేశారు : మంత్రి రోజా

-

టీడీపీ అధినేత చంద్రబాబు ఇన్నాళ్లూ వ్యవస్థలను మేనేజ్ చేశారు. ఓ వైపు పవన్ కళ్యాణ్, మరోవైపు బ్రాహ్మీణి చంద్రబాబు సంతకాలు పెట్టలేదని పేర్కొంటున్నారు. మీకు ఏమైనా డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. చంద్రబాబు దుర్మార్గుడు, మోసగాడు కాబట్టే అరెస్ట్ చేశారు. చంద్రబాబును అక్రమ అరెస్ట్ చేయడం జగన్ మోహన్ రెడ్డికి అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ఎందులోనైనా సక్సెస్ సాధించారా అని ప్రశ్నించారు మంత్రి రోజా.

చంద్రబాబు 13 చోట్ల సంతకాలు పెట్టారు. అచ్చెన్నాయుడు 5 చోట్ల సంతకాలు పెట్టారు. మీకు అంత డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. బ్రాహ్మిణికి ఎవరు చదువు చెప్పారో వారు తల బద్దలు కొట్టుకోవాల్సిందే. చెన్నై, బెంగళూరు, పూణె, కోల్ కతా, అహ్మదాబాద్ పలు రాష్ట్రాల్లో ఐటీ పరిశ్రమలున్నాయి. ఆ రాష్ట్రాలన్నింటికి చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నాడా..? పీఎం ఉన్నాడా అని ప్రశ్నించారు మంత్రి రోజా. ఐటీని పరిచయం చేసింది చంద్రబాబు అని బ్రాహ్మిణి చెప్పడం హాస్యస్పదమన్నారు. అమ్మా బ్రాహ్మిణి ఇంటికొక ఉద్యోగం ఇస్తానని.. బాబు వస్తే జాబు వస్తుందని మీ మొగుడు లోకేశ్ కి మంత్రి పదవీ ఇచ్చాడే తప్ప ఎవ్వరికీ ఉద్యోగం ఇవ్వలేదని పేర్కొన్నారు. ఉద్యోగాల పేరుతో చంద్రబాబు యువతను మోసం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news