BREAKING : తిరుమల నడక మార్గంలోని ఫుట్ పాత్ పై ఎలుగుబంటి కలకలం రేపింది. తిరుమల అలిపిరి నడక మార్గంలోని నరసింహస్వామి ఆలయం వద్ద ఫుట్ పాత్ పై ఎలుగుబంటి కనిపింది. నిన్న రాత్రి సంచారాన్ని గుర్తించింది నడక మార్గంలోని సెక్యూరిటీ సిబ్బంది. రాత్రి 11 గంటల సమయంలో వచ్చిన ఎలుగు బంటి… చాలా సేపు నడక మార్గంలోనే తిష్ట వేసిందని సమాచారం అందుతోంది.
అయితే.. ఈ విషయంపై డిఏఫ్ఓ చంద్రశేఖర్ స్పందించారు. భక్తుల సంచారం లేని సమయంలో నడకదారిలో ఎలుగుబంటి సంచరించిందన్నారు డిఏఫ్ఓ చంద్రశేఖర్. రాత్రి 11:45 గంటలకు చివరి బ్యాచ్ భక్తులు సంచారం జరిగిందని… రాత్రి 12:30 గంటలకు ఎలుగుబంటి సంచరించిందని వెల్లడించారు. నడకదారిలో శ్రీవారి భక్తులుకు కట్టుదిట్టమైన భధ్రతా ఏర్పాట్లు చేసామని.. అభయారణ్యంలో జంతువుల సంచారం సహజమేన్నారు డి ఏఫ్ఓ చంద్రశేఖర్. భక్తులు ఎవరూ కూడా భయపడవద్దని కోరారు