వరల్డ్ కప్ ముందు ఆస్ట్రేలియా పై గ్రాండ్ విక్టరీ కొట్టింది టీమిండియా. నిన్న ఆస్ట్రేలియా వర్సెస్ టీమ్ ఇండియా జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా పై ఐదు వికెట్ల తేడాతో గ్రాండ్ విజయం సాధించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 277 పరుగులను ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది టీమిండియా.
మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 50 ఓవర్లలో 276 పరుగులు చేసింది. ఆ లక్ష్యాన్ని 48.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి చేదించింది టీమిండియా. దీంతో 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన టీమిండియా వన్డేల్లో అగ్ర జట్టుగా నిలిచింది. టీమిండియా బ్యాటింగ్ విషయానికి వస్తే… ఓపెన్ ఋతురాజు 71 పరుగులు గిల్ 74 పరుగులు కేఎల్ రాహుల్ 58 పరుగులు మరియు సూర్యకుమార్ యాదవ్ 50 పరుగులు చేసి టీమ్ ఇండియాకు విక్టరీని అందించారు. ఇక రేపు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే జరగనుంది.