గడపగడప ఫైనల్ రిపోర్ట్ పై నేడు సీఎం జగన్ భేటీ కానున్నారు. ఇవాళ క్యాంపు కార్యాలయంలో గడప గడపపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమీక్ష చేయనున్నారు. అయితే.. ఇదే చివరి సమావేశం, ఎమ్మెల్యేల భవితవ్యం ఇవాళే తేలిపోతుందని ప్రచారం సాగుతోంది. అయితే ఈ అంశం పై మంత్రి కాకాణి స్పందించారు.
ఇదే చివరి సమావేశం, ఎమ్మెల్యేల భవితవ్యం ఇవాళే తేలిపోతుంది అన్నది ప్రచారం మాత్రమే అని వెల్లడించారు మంత్రి కాకాణి. గడప గడపపై రెగ్యులర్‌గా జరుగుతున్న సమీక్ష లాంటిదేనని చెప్పారు. ఎమ్మెల్యేల పని తీరుపై ముఖ్యమంత్రి దృష్టి ఉంటుందని వెల్లడించారు. తాజా పరిణామాల నేపథ్యంలో మీడియానే ఈ సమావేశానికి ప్రాధాన్యత కల్పించిందన్నారు మంత్రి కాకాణి.
అటు సబ్సిడీపై శనగ విత్తనాల పంపిణీకి శ్రీకారం చుట్టింది జగన్ సర్కార్. రబీలో 10.92 లక్షల ఎకరాల్లో శనగ సాగు చేస్తారని అంచనా ఉండగా, RBKల ద్వారా 3.44 లక్షల క్వింటాళ్ల విత్తన పంపిణీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతేడాది 25% సబ్సిడీ ఇవ్వగా, ఈసారి 40% సబ్సిడీతో విత్తనాలను అక్టోబర్ 1 నుంచి అందించనుంది.