యజమాని ఐడియాతో ప‌నిమ‌నిషి జీవిత‌మే మారిపోయింది.. ఏం జ‌రిగిందంటే..?

-

ఓ య‌జ‌మాని ఐడియా ప‌నిమ‌నిషి జీవితాన్నే మార్చిసింది. పూణేకు చెందిన ధనశ్రీ షిండే బ్రాండింగ్, మార్కెటింగ్ రంగంలో సీనియర్ మేనేజర్. ఆమె ఇంట్లో గీతా కాలె అనే మహిళ పనిచేస్తోంది. ఓ రోజు ఆఫీసు నుంచి ఇంటికొచ్చిన ధనశ్రీ.. గీత దిగాలుగా ఉండడం చూసి విషయం ఆరా తీయ‌గా.. ఓ యజమాని తనను పని నుంచి తీసేశారని, ఈ కారణంగా తన ఆదాయం తగ్గిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె చెప్పింది విన్న తర్వాత ధనశ్రీలో చటుక్కున ఓ ఆలోచన త‌ట్టింది. వెంటనే గీత కోసం ఓ బిజినెస్ కార్డు తయారుచేసింది.

‘గీతా కాలె, ఇంటిపని సహాయకురాలు, బావ్దాన్’ పేరుతో వంద కార్డులు ప్రింటి చేయించి.. ఆ కార్డులను ఓ వ్యక్తి సాయంతో తమ కాలనీలో అందరికీ పంపిణీ చేయించింది. అలాగే అందులో గీత చేసే ఒక్కో పనికి ఎంతమొత్తం తీసుకుంటుందన్న విషయాలను కూడా ముద్రించింది. అయితే అస్మితా జవదేకర్ అనే మహిళ ఈ కార్డు చూసి ధనశ్రీ ఆలోచనకు ఆశ్చ‌ర్య‌పోయింది. వెంటనే తన ఫేస్‌బుక్‌లో ఆమె కార్డును పోస్టు చేసింది. ఇక‌ అంతే.. క్షణాల్లోనే అది వైరల్ అవ్వ‌డంతో తాము పని ఇస్తామంటూ వందలాదిమంది గీతకు ఫోన్ చేస్తున్నారు. విశేషం ఏంటంటే..దేశం నలుమూలల నుంచి కూడా గీతకు ఫోన్లు వస్తుండడం.

Read more RELATED
Recommended to you

Latest news