ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్‌ !

-

ఏపీ ప్రజలకు అలర్ట్.. ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్‌ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నేడు బంగాళా ఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడే అవకాశం ఉందని సమాచారం. దీంతో వచ్చే మూడు రోజులు ఏపీలోని పలు జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్ష సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Alert to the people of AP There is a chance of thunder in these districts

ఇవాళ పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్త నుంచి భారీ వర్షాలకు అవకాశ ముందని తెలిపింది. ఈ జిల్లాలకు పిడుగులు పడే ఛాన్స్‌ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news