తిరుమల భక్తులకు అలర్ట్..క్యూ లైన్ లేకుండానే దర్శనం చేసుకోవచ్చు. తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ తగ్గింది. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం జరుగుతోంది. కాగా 82,436 మంది భక్తులు నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు. 25,437 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.57 కోట్లుగా నమోదు అయింది.

Alert to Tirumala devotees Darshan without queue line
అటు ఇవాళ డిసెంబర్ దర్శన టికెట్లు విడుదల కానున్నాయి. తిరుమలలో ఇవాళ ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో డిసెంబర్ నెలకు సంభందించిన అంగప్రదక్షణ టోకేన్లు విడుదల కానున్నాయి. ఈ మేరకు టీటీడీ పాలక మండలి అధికారిక ప్రకటన చేసింది. ఇవాళ 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టిక్కెట్లు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు ,వికలాంగుల దర్శన టిక్కెట్లు విడుదల చేయనుంది. రేపు ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లు విడుదల చెయ్యనుంది టీటీడీ పాలక మండలి. అటు రేపు మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదులు కోటాను విడుదల చెయ్యనుంది టీటీడీ పాలక మండలి.