కృష్ణా జలాల పునః పంపిణీ రాష్ట్రానికి శాపంగా మారుతుందని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలంగాణ సగం వాటా అడుగుతోంది.. దీనికి ఎలా ఒప్పుకుంటారు అని ప్రశ్నించారు. కృష్ణా జలాల పంపిణీని బ్రిజేష్ కుమార్ ట్రిబునల్ కు ఇవ్వడం సరైన చర్య కాదు అన్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని జగన్ ఎందుకు వ్యతిరేకించడం లేదు అని ప్రశ్నించారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాసిన లేఖ రాష్ట్రానికి మరణ శాసనం రాసింది.
ఇప్పుడు మరోసారి ఆయన కుమారుడు జగన్ తీవ్ర నష్టం చేకూరుస్తున్నారు. కేవలం తన కేసుల నుంచి బయటపడటానికి ఇలా జగన్ మౌనంగా ఉన్నారు. పక్క రాష్ట్రాల్లో తన ఆస్తులు కాపాడుకోవడానికి నోరు మెదపడం లేదు. ఢిల్లీకి వెళ్లిన జగన్ కృష్ణా జలాల విషయంలో కేంద్రంతో మాట్లాడాలి. ఇప్పటికే సీఎం జగన్ ఎప్పటికీ రాయలసీమ ద్రోహి గానే మిగిలిపోయారని ప్రశ్నించారు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు.