తెలంగాణ సచివాలయం ముందు సీతక్కకు అవమానం !

-

కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కకు బిగ్‌ షాక్‌ తగిలింది. తెలంగాణ రాష్ట్ర సచివాలయం వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కకు చేదు అనుభవం ఎదురయింది. తన నియోజకవర్గంలో సమస్యల విషయమై సచివాలయంలో అధికారులను కలిసేందుకు వచ్చిన ఆమెకు పోలీసులు వాహనంతో లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దాంతో ఆమె అసహనం వ్యక్తం చేస్తూ కాసేపు అక్కడే నిల్చున్నారు.

Shame on Sitakka in front of the Telangana Secretariat
Shame on Sitakka in front of the Telangana Secretariat

తర్వాత వాహనాన్ని గేటు ముందే నిలిపి నడుచుకుంటూ సచివాలయంలోనికి వెళ్లారు. బయటకు వచ్చాక సీతక్క మీడియాతో మాట్లాడుతూ…”ప్రజల కోసం ప్రజాధనంతో నిర్మించిన సచివాలయంలోకి ఎమ్మెల్యేలకే అనుమతి లేకుంటే ఎలా? అనుమతి లేదనడం పొరపాటు. నేను తీవ్రంగా ఖండిస్తున్నా. వివిధ విభాగాల్లోని అధికారులకు, పీఎస్ లకు వినతిపత్రాలు ఇచ్చి వచ్చా. పోలీసులు వారి ఉద్యోగరీత్యా పని చేస్తున్నారేమో కానీ, వారికి ఇలాంటి ఆదేశాలను ఎందుకు ఇస్తున్నారు. ఇది సచివాలయమా, సొంత భవనమా? ప్రతిపక్షాలు, ప్రశ్నించే గొంతుకలు రావద్దని బోర్డు పెట్టండి” అని వాక్యానించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news