ఈ రోజు ఢిల్లీ లో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ లో రికార్డుల వెల్లువ జరిగింది అని చెప్పాలి. సౌత్ ఆఫ్రికా లాంటి అత్యుత్తమ ఆటగాళ్లు ఉన్న జట్టుపై బౌలింగ్ చేయాలంటే ఎవ్వరికైనా చాలా కష్టమని చెప్పాలి. అందులోనూ అంతగా వరల్డ్ కప్ అనుభవం లేని కుర్రాళ్ళు శ్రీలంక జట్టులో ఉండడం ఇంకా బాధాకరం అని చెప్పాలి. ఇవన్నీ వెరసి సౌత్ ఆఫ్రికా జట్టు వరల్డ్ కప్ లో తాము ఆడిన మొదటి మ్యాచ్ లోనే మిగిలిన జట్లకు డేంజర్ సిగ్నల్స్ పంపించింది. సౌత్ ఆఫ్రికా నిర్ణీత ఓవర్ లలో 428 పరుగులు చేసింది. జట్టు ఇంత స్కోర్ ను సాధించడంలో ముఖ్యంగా ముగ్గురు బ్యాట్స్మన్ లు కీలక పాత్ర పోషించారు. డికాక్ , డస్సెన్ మరియు మార్కురామ్ లు సీనెతురై చేయగా… మార్కురామ్ మాత్రం కేవలం 49 బంతుల్లోనే సెంచరీ చేసి వరల్డ్ కప్ చరిత్రలో అత్యంత వేగవంతమగా చేసిన ఘనతను సాధించాడు.
ఇతను తన ఇన్నింగ్స్ లో 54 బంతులను ఎదుర్కొని 14 ఫోర్లు మరియు 3 సిక్సులతో 106 పరుగులు చేశాడు. ఇక ఛేజింగ్ ను స్టార్ట్ చేసిన శ్రీలంక అప్పుడే నిస్సంక వికెట్ ను కోల్పోయింది.