టాలీవుడ్‌ నటి మీనాపై టీడీపీ ట్రోలింగ్‌..!

-

టాలీవుడ్‌ నటి మీనాపై టీడీపీ పార్టీ సోషల్‌ మీడియా ట్రోలింగ్‌ కు దిగింది. నువ్వు విమర్శించే వ్యక్తి ఎమ్మెల్యేనో, ఎంపీనో కూడా నీ మొఖానికి తెలియదు అంటూ మీనాపై ఫైర్‌ అవుతున్నారు టీడీపీ నేతలు. టీడీపీ నేత బండారు పై సినీ నటి మీనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి రోజా పై టీడీపీ నేత బండారు నీచమైన వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు సినీ నటి మీనా. బండారు ఎంత దిగజారుడు మనస్తత్వం ఉన్నవాడో అర్థమయ్యేలా ఉన్నాయని నిప్పులు చెరిగారు.

TDP trolling Tollywood actress Meena
TDP trolling Tollywood actress Meena

అతని అభద్రత భావం, అసూయకి నిదర్శనం అన్నారు. మంత్రి రోజా సినిమా ఇండస్ట్రీ కి వచ్చినప్పటి నుండి నాకు తెలుసు అని… ఆమె తో కలిసి నటించిన వ్యక్తిగా ఆమె కోసం నాకు పూర్తిగా తెలుసు అని వివరించారు సినీ నటి మీనా. అయితే.. ఈ సందర్భంగా మాజీ ఎంపీ అంటూ టీడీపీ నేత బండారును ఉద్దేశించి.. మాట్లాడారు మీనా. దీంతో నటి మీనాపై టీడీపీ పార్టీ సోషల్‌ మీడియా ట్రోలింగ్‌ కు దిగింది. నువ్వు విమర్శించే వ్యక్తి ఎమ్మెల్యేనో, ఎంపీనో కూడా నీ మొఖానికి తెలియదు…. చిల్లర కోసం ఎవడో స్క్రిప్ట్ రాశిస్తే, ఎగేసుకొని వచ్చేయడం సొల్లు చెప్పడం…. మీరెంత దిగజారిపోయారో ప్రజలకు అర్థమవుతుందంటూ ఫైర్‌ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news