ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేతగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు సిఐడి పోలీసులు గత నెలలో అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన సంగతి తెలిసిందే. అయితే.. స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయిన టిడిపి అధినేత చంద్రబాబు… నవంబర్ చివరి వరకు జైల్లోనే అవకాశం ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
17A చెల్లుబాటుపై సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ వేసిన పిటిషన్ పై నవంబర్ 20న సుప్రీం తీర్పు వచ్చే అవకాశం ఉంది. దీంతో అప్పటివరకు బాబు లాయర్ల 17A వాదనను పరిగణలోకి తీసుకోవద్దని రేపు సుప్రీంను కోరుతుందని YCP శ్రేణులు పోస్టులు పెడుతున్నాయి. రేపు దీనిపై క్లారిటీ రానుంది. కాగా, మొన్న చంద్రబాబు ను జైలుకు వెళ్లి కలిసి ఆయనతో చర్చిన అనంతరం మీడియా ముందుకు వచ్చిన నారా లోకేష్… చంద్రబాబు ఎప్పుడూ తప్పు చేయరు, ప్రజల కోసం పోరాడిన పాపానికి ఆయనపై అన్యాయంగా కేసులు పెట్టి జైల్లో పెడతారా అంటూ క్లారిటీ ఇచ్చారు.