తొమ్మిదేళ్ల కల్వకుంట్ల పాలన చూసి తెలంగాణ ప్రజలు విసుగు చెందారని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. తెలంగాణ కేంద్రం చేయాల్సింది అంత చేసింది. అవినీతి ఆరోపణలు లేకుండా తొమ్మిదేళ్ల పాలన మోడీ అందించారు. ఇండ్లు, స్కాలర్ షిప్స్, నిరుద్యోగ, భృతి ఇవ్వలేదని ఆరోపించారు. అన్ని వర్గాల ప్రజలను కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసింది. కేసీఆర్ ను ఓడించేందుకు ప్రజలు నిర్ణయించుకున్నారు. కేసీఆర్ చేసిన ప్రతి పథకంలో అవినీతి ఉంది.. 30 శాతం కమీషన్ల ప్రభుత్వం.. తెలంగాణలో ముమ్మాటికీ బీజేపీ ప్రభుత్వం వస్తుందని ధర్మపురి అరవింద్ ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రజలకు మోడీ ప్రభుత్వం మేలు చేసే పనులు చేశారని ధర్మపురి అరవింద్ అన్నారు. అందరూ ముఖ్యనేతలు అసెంబ్లీకి పోటీ చేస్తారు. ఎన్ని సీట్లు వచ్చిన మేమే అధికారంలోకి వస్తాం.. కేసీఆర్ తో కలిసి వెళ్లాం. వంద శాతం కాంగ్రెస్ బీ-ఫామ్ లు కేసీఆర్ యే పంచుతున్నారు. కాంగ్రెస్ కి డబ్బులు పంచేది కేసీఆర్ యే. కేసీఆర్ తో పోరాడేది బీజేపీనే అని ఆయన చెప్పుకొచ్చారు. ఎన్డీఏలోకి కేసీఆర్ ని రానియ్యలేదు మోడీ. కేటీఆర్ ను సీఎం కానివ్వలేదు మోడీ.. పార్టీ ఎక్కడ నుంచి పోటీ చేయమని ఆదేశించిన చేస్తానని ధర్మపురి అరవింద్ అన్నారు.