బీఆర్ఎస్ మేనిఫెస్టో వచ్చిన తరువాత ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అవుతుంది : మంత్రి హరీశ్ రావు

-

హుస్నాబాద్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి హరీశ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హుస్నాబాద్ లోని కార్యకర్తల మీద నమ్మకంతో సీఎం కేసీఆర్ హుస్నాబాద్ లో మొదటి ఎన్నికల సభ పెడుతున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్ కి ఈశాన్యంలో ఉన్న హుస్నాబాద్ లో కలిసి వచ్చిన నియోజకవర్గం అని సీఎం కేసీఆర్ అన్నారన్నారు. ఎవరు అవునన్నా కాదన్నా మూడోసారి బీఆర్ఎస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు హరీశ్ రావు.

అసత్య సర్వేల పేరిట అధికారంలోకి వస్తాం అని కాంగ్రెసోల్లు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. కనీసం టికెట్లు కూడా ఇచ్చుకోలేని దాయనీయ పరిస్థితిలో కాంగ్రెస్  పార్టీ ఉందన్నారు. కాంగ్రెసోల్లు ఢిల్లీలో ఎక్కువ.. గల్లీలో తక్కువ మాటలు, ముఠాలు, మూటలు, మంటలు కాంగ్రెస్ పార్టీ తీరు అన్నారు. హూస్నాబాద్ ప్రాంతంలో గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తి కాకుండా కాంగ్రెస్, బీజేపీ వాళ్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. గౌరవెల్లి ప్రాజెక్ట్ సీఎం కేసీఆర్ హుస్నాబాద్ కి ఇచ్చిన గొప్ప వరం. ఈనెల 15న బీఆర్ఎస్ మేనిఫెస్టో వచ్చిన తరువాత ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అవుతుంది. 2009లో మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టి ఏ ఒక్క పని చేయలేదు.

Read more RELATED
Recommended to you

Latest news