సీఎం కేసీఆర్ లేటెస్ట్ ఫోటో వైరల్

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తాజా ఫోటో వైరల్ గా మారింది. వైరల్ ఫీవర్ మరియు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ తో బాధపడ్డ తెలంగాణ సీఎం కల్వకుంట చంద్రశేఖర రావు గత కొన్ని రోజులుగా ప్రగతి భవన్ కే పరిమితమయ్యారు. అధికారిక కార్యక్రమాలలోనూ పాల్గొనలేదు సీఎం కేసీఆర్. అయితే అనారోగ్యం నుంచి కోరుకున్న సీఎం కేసీఆర్ను నిన్న సాయంత్రం తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కలిశారు.

cm kcr
cm kcr

పాలమూరు ప్రోగ్రెస్ రిపోర్టును సీఎం కేసీఆర్ కు అందజేశారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోలో సీఎం కేసీఆర్ ఆరోగ్యంగా కనిపించారు. అయితే సీఎం కేసీఆర్ కు తెల్ల గడ్డం వచ్చి…. కాస్త డల్ గానే కనిపించాడు. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. కాగా ఈనెల 15వ తేదీన హుస్నాబాద్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. అక్కడి నుంచే ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభిస్తారు సీఎం కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news