బొల్లారంలో రూ.3.5 కోట్ల విలువ చేసే వేయి కిలోల గంజాయి పట్టివేత

-

హైదరాబాద్ బొల్లారంలో నార్కోటిక్ విభాగం పోలీసులు భారీ ఎత్తున గంజాయి పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు వారివద్ద నుంచి మూడున్నర కోట్ల విలువైన వెయ్యికిలోల సరకును స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు నుంచి హైదరాబాద్ మీదుగా ముంబయి, బీదర్ తరలిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

కర్ణాటక బీదర్‌కి చెందిన సాకారాం రాథోడ్ బతుకుదెరువు కోసం 2002లో హైదరాబాద్ వచ్చి పానీపూరిబండి నిర్వహించాడు. ఆశించిన మేర డబ్బులు రాకపోవడంతో 2010లో తిరిగి సొంతూరికి వెళ్లాడు. ఓచక్కెర పరిశ్రమలో…. లేబర్ కాంట్రాక్టర్‌గా పనిచేశాడు. అక్కడి కూలీలంతా గంజాయి సేవించడాన్ని గమనించిన సాకారాం….ఒడిశా మల్కన్‌గిరిలో విక్రయదారులతో పరిచయం పెంచుకున్నాడు. అక్కడి నుంచి గంజాయి తీసుకొచ్చి మహారాష్ట్రకు చెందిన అజయ్ చౌరాసియాకి విక్రయించేవాడు.

ఈ క్రమంలో నాలుగురోజుల క్రితం డీసీఎం వ్యానులో మహారాష్ట్ర నుంచి బయల్దేరి… మల్కన్‌గిరికి చెందిన సన్యాసిరావుతో వేయి కిలోల గంజాయి కొనుగోలు చేసి బీదర్‌కి తీసుకెళ్తుండగా పక్కా సమాచారంతో బొల్లారం వద్ద పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి డీసీఎం సహా వేయి కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల నుంచి తప్పించుకునేందుకు సాకారాం రాథోడ్, అజయ్ చౌరాసియా స్విఫ్ట్ కారులో డీసీఎం ముందువస్తూ డ్రైవర్‌ని అప్రమత్తం చేసేలా ప్రణాళిక రచించారు. డ్రైవర్లు ఇచ్చిన సమాచారంతో కారుతో పాటు సాకారాం రాథోడ్, అజయ్ చౌరాసియాను అరెస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news