ఎన్నికల వేళ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో భారీగా బంగారం, నగదు, మద్యం.. కొన్నిచోట్ల గంజాయి పట్టుబడుతోంది. ఇప్పటి వరకు తాము స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ రూ.130 కోట్ల 26 లక్షల 91 వేలా 531 రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. 16వ తేదీ ఉదయం నుంచి 17వ తేదీ ఉదయం వరకు 21 కోట్లా 84 లక్షలా 92 వేలా 242 విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. 71 కోట్లా 55 లక్షలా 58 వేలా 94 రూపాయల నగదు.. 52,091 లీటర్ల మద్యం, 1280 కిలోల నల్లబెల్లం, 530 కిలోల ఆలం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వాటి విలువ మొత్తం ఏడు కోట్లా 75 లక్షలా 79 వేలా 917 రూపాయలు ఉంటుందని అంచనా వేశారు.
మరోవైపు నాలుగు కోట్లా 58 లక్షలా నాలుగు వేలా 720 రూపాయల విలువైన వేయి 694 కిలోల గంజాయి పట్టుబడినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు 72 కిలోలకు పైగా బంగారం, 420 కిలోలకు పైగా వెండి, 42 క్యారట్ల వజ్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటి విలువ మొత్తం 40 కోట్లా ఎనిమిది లక్షలా 44 వేలా 300 రూపాయలుగా ఉందని.. స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్ లు, వాహనాలు, కుక్కర్లు, చీరలు, క్రీడా సామాగ్రి మొదలైన కానుకల విలువ ఆరు కోట్లా 29 లక్షలా నాలుగు వేలా 500 రూపాయలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు.