ఈ బెడ్‌ ధర 5 కోట్లు.. ఒక్క రాత్రికి రెంట్‌కు రూ.8 లక్షలట..!!

-

సొంత ఇళ్లు ఉండాలని ప్రతి మనిషి కోరుకుంటాడు. అందమైన ఇళ్లు, అందులో మంచి ఫర్నీచర్‌ ఉంటే.. ఇంటి రాగానే హాయిగా ఉంటుంది. ఎంత డబ్బున్న వాళ్లైనా పడుకునే పరుపు కోసం కోట్లు ఖర్చుపెడతారా..? మరీ బాగా రిచ్‌ అయితే లక్షల్లో పెట్టొచ్చు. కానీ బెడ్‌కు 5కోట్లు పెట్టి కొనేవాళ్లు ఉన్నారంటే నమ్మగలరా..? నమ్మాలి. ఇప్పుడు చెప్పుకోబేయే బెడ్‌ కాస్ట్‌.. 660,000 డాలర్లతో దాదాపు 5 కోట్లు. దాని ప్రత్యేకత ఏమిటి? అసలు ఇది ఎవరు తయారు చేశారు, ఎవరు వాడతారు చూద్దామా.!

5 కోట్ల బెడ్‌ను ఎవరు తయారు చేశారు? :

ఈ ఖరీదైన పరుపును స్వీడిష్ బెడ్ అమ్మకందారు హెస్టెన్స్ హ్యాండీక్రాఫ్ట్ బెడ్ విడుదల చేసింది. హెస్టెన్స్ ఈ పరుపును స్లీప్ ఇన్స్ట్రుమెంట్ అని పిలిచారు. ఐదు కోట్లు ఖ‌ర్చు చేసి.. కొంత మంది ఈ మంచాన్ని కొనుగోలు చేశారు. ఇందులో బెయోన్స్, బ్రాడ్ పిట్, డ్రేక్, టామ్ క్రూజ్ మరియు ఏంజెలీనా జోలీ ఉన్నారు.

ఈ పరుపు ప్రత్యేకత అదే..

ఈ పరుపు ప్రత్యేకమైనది ఎందుకంటే ఇది గుర్రపు వెంట్రుకలతో తయారు చేశారు. ఈ పరుపుకు 25 సంవత్సరాలు గ్యారెంటీ ఉంది. వీళ్లు చేసే పరుపులు అన్నీ ఒకే కాస్ట్‌ ఉండవట.ఈ బెడ్ యొక్క ప్రారంభ ధర 25000 డాలర్లు సుమారు 2 కోట్ల రూపాయల నుండి మొదలవుతుంది. ఇది మొదటిసారిగా 1852లో స్వీడన్‌లోని వెస్ట్‌మన్‌ల్యాండ్ కౌంటీలోని కోపింగ్‌లో ఉత్పత్తి చేయబడింది. ఇంత ఎక్కువ ధరకు పరుపులను కొనుగోలు చేసే కస్టమర్లు సంతోషంగా ఉండాలనే కారణంతో హెస్టెన్స్ ట్రైల్ వేసుకునే అవకాశం ఉంది. US అంతటా కంపెనీ స్టోర్లలో ట్రయల్స్ ఉంటాయట.

వినియోగదారులను చీకటి, లావెండర్-సువాసన గల షోరూమ్‌లోకి వెళ్తారు. మంచం మీద పడుకునేటప్పుడు మీరు ఏమి చూడాలో కూడా ఇది మీకు చెబుతుంది. ఇది సుమారు గంట సమయం పడుతుంది. కొనుగోలు చేసిన తర్వాత, ప్రత్యేక నిర్వహణ అవసరం. మీ mattress మంచి స్థితిలో ఉంచడానికి, కాసేపు 180 డిగ్రీలు తిరగాల్సి ఉంటుంది.

ఒక్క రాత్రికి 8 లక్షలు..

కంపెనీ ఈ బెడ్‌ను అద్దెకు ఒక్క రాత్రికి 8 లక్షల రూపాయలు ఛార్జ్‌ చేస్తుంది. హస్టెన్స్ 2000T బెడ్ లండన్‌లోని లాంగ్‌హామ్‌లోని ఇన్ఫినిటీ సూట్స్ హోటల్‌లో ఉంది. అతిథులు ఈ హోటల్‌లో మూడు వేర్వేరు హెస్టెన్స్ బెడ్‌లలో పడుకోవచ్చు. ఇక్కడ ఒక రాత్రికి 8 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది.

ఇంత ఖరీదైన బెడ్‌లు ఉంటాయా అనేది ఆశ్చర్యం అంటే.. వాటిని కొనుగోలు చేసే వాళ్లు కూడా ఉన్నారు చూడండి అది ఇంకా హైలెట్‌.

Read more RELATED
Recommended to you

Latest news