కాంగ్రెస్ విజయభేరి బస్సుయాత్రలో దోస వేసిన రాహుల్ గాంధీ.. వీడియో వైరల్

-

తెలంగాణలో మూడ్రోజులుగా పర్యటిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. ఆ పార్టీ నిర్వహిస్తున్న విజయ భేరి బస్సు యాత్రలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ జగిత్యాల నుంచి నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​కు వెళ్తున్నారు. ఈ మార్గంలో రాహుల్‌గాంధీ…. ఓ చోట ఆగారు. టిఫిన్ సెంటర్‌ వద్ద చిరు వ్యాపారితో ముచ్చటించారు. అనంతరం అక్కడే దోసెలు వేస్తూ… సందడి చేశారు. ఈ సందర్భంగా రాహుల్​కు ఆ టిఫిన్ బండి యజమానికి దోసె వేయడం నేర్పించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. రాహుల్ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

విజయభేరీ బస్సు యాత్రలో భాగంగా చివరి రోజు ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్‌లో పర్యటిస్తున్న రాహుల్‌ ఉదయం జగిత్యాలకు బయలుదేరారు. మార్గమధ్యలో నూకపల్లి బస్టాండు వద్ద వాహనం ఆపిన ఆయన…. రోడ్డు పక్కనున్న ప్రయాణికులను కలిశారు. ద్విచక్రవాహనంపై వెళ్తున్న వారితో ముచ్చటించి…. చిన్నారులకు చాక్లెట్లు పంచారు. బస్టాండు వద్దనున్న టిఫిన్‌ బండి వద్దకు వెళ్లిన రాహుల్‌గాంధీ….. స్వయంగా గరిటపట్టాడు. టిఫిన్‌ బండి వద్ద స్వయంగా దోసెలు వేశారు. టిఫిన్‌ బండి నిర్వాహకుడితో మాట్లాడిన రాహుల్‌…. వారి ఆదాయం, ఖర్చుల గురించి తెలుసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news