ఈ రోజు ముంబై వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా మరియు బంగ్లాదేశ్ లు తలపడుతున్నాయి. మొదట టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది.. మొదటి ఓవర్లలో చాలా నెమ్మదిగా ఆడిన సౌత్ ఆఫ్రికా ఆ తర్వాత వేగాన్ని పెంచింది.. ఈ దశలో హెన్డ్రిక్స్ (12), డస్సెన్ (1) లు వికెట్ లు కోల్పోయినా, డికాక్ మాత్రం కెప్టెన్ మార్ క్రామ్ (60) తో కలిసి స్కోర్ బోర్డు పడిపోకుండా ఆడాడు. కాగా ఓపెనర్ డికాక్ పరిస్థితులకు తగినట్లు ఆడుతూ ఈ వరల్డ్ కప్ లో మూడవ సెంచరీని సాధించాడు. ఇప్పటికే డికాక్ తాను ఆడిన మొదట మరియు రెండవ మ్యాచ్ లలో వరుసగా రెండు సెంచరీ లు చేయగా, ఈ రోజు బంగ్లా పై మూడవ సెంచరీ చేశాడు.
డికాక్ ప్రస్తుతం 106 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఇతనికి తోడుగా క్లాజెన్ క్రీజులో ఉండగా వీరిద్దరూ నిలబడి ఆడితే మరోసారి సౌత్ ఆఫ్రికా పరుగులు చేయడం ఖాయం.