ఓటీటీలోకి వచ్చేసిన పెదకాపు మూవీ.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!

-

శ్రీకాంత్ అడ్డాల పేరు వినగానే గుర్తొచ్చేది కుటుంబ కథా చిత్రాలు.. ప్రేమలు ఆప్యాయతలు.. బంధాలు.. అనుబంధాలు. ఆయన ఇప్పటి వరకు తీసిని సినిమాలన్నీ కుటుంబ కథలే. అయితే తొలిసారిగా ఆయన తన పంథా మార్చుకున్నారు. కొత్త రూట్​ వెళ్లి ఓ ప్రయోగం చేశారు. అదే పెదకాపు సినిమా. శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్‌ 29వ తేదీన విడుదలైంది.

శ్రీకాంత్ అడ్డాల కొత్త ప్రయోగం చేయడంతో ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. కానీ సినిమా విడుదలైనత మధ్య విడుదలై మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ఈరోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. విరాట్‌ కర్ణ హీరోగా ప్రగతి శ్రీవాస్తవ హీరోయిన్​గా.. నటించగా.. రావు రమేశ్‌, నాగబాబు, తనికెళ్ల భరణి, బ్రిగిడ సాగా, రాజీవ్‌ కనకాల, అనసూయ కీలకపాత్రలు పోషించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ వెంటనే అమెజాన్ ప్రైమ్​లో ​ను ఈ సినిమా చూస్తూ ఈ వీకెండ్​ను ఎంజాయ్ చేయండి.

Read more RELATED
Recommended to you

Latest news