AP : నవంబరు 2 నుంచి విశాఖలో అంతర్జాతీయ సదస్సు జరుగనుంది. జల వనరుల సంరక్షణపై నవంబర్ 2 నుంచి 8 వరకు విశాఖలో అంతర్జాతీయ సదస్సు జరగనుంది. ఋషికొండలోని రాడిసిన్ బ్లూ హోటల్ లో జరగనున్న అంతర్జాతీయ సదస్సును కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షేకావత్ తో కలిసి సీఎం జగన్ ప్రారంభించనున్నారు.
ఈ సదస్సుకు 90 దేశాల నుంచి అతిధులు, ఐసిఐడి, సిడబ్ల్యుసి ఉన్నతాధికారులు, సభ్యులు హాజరవుతారని విశాఖ జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున తెలిపారు. ఇది ఇలా ఉండగా.. నవంబర్ 1న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుగనున్న సంగతి తెలిసిందే. అయితే.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1న ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజున ఉదయం 10 గంటలకు సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగే ఉత్సవాల్లో సీఎం జగన్, రాజ్ భవన్ లో జరిగే వేడుకల్లో గవర్నర్ పాల్గొంటారు. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించాలని కలెక్టర్లు, ఎస్పీలను జిఏడి ముఖ్య కార్యదర్శి ముత్యాలరాజు ఆదేశించారు. తెలుగు సాంస్కృతిని ప్రతిబింబించేలా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.