బీఆర్ఎస్ కంటే ముందు ఈ రాష్ట్రంలో చాలా పార్టీలు అధికారంలో ఉన్నాయి. అప్పుడు చాలా మంది అవమానించారు. కాంగ్రెస్ మోసం చేస్తే కేసీఆర్ శవయాత్రనా..? జైత్రయాత్రనా అని దీక్ష మొదలు పెట్టాను. నన్ను అరెస్ట్ చేసి ఇదే ఖమ్మం జైలులో పెట్టారు. తెలంగాణ ఇవ్వాల్సిన పరిస్థితిని సృష్టించాం. కేసీఆర్ వల్లనే పాలేరుకు మోక్షం వచ్చిందన్న నేతలు ఇవాళ ఉల్టా మాట్లాడుతున్నారు. ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలని కోరుతున్నాను.
నరం లేని నాలుకలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాయి. కమ్యూనిస్టులు చాలాకాలం ఉన్న ప్రాంతం, చైతన్యవంతమైన ప్రాంతం ఇది. పదవుల కోసం పార్టీలు మారేవారు మన మధ్యే ఉన్నారు. ప్రజల కోసం ఎవరు పని చేశారో వారినే గెలిపించాలి. పూటపూటకో పార్టీ మారేవారికి అవకాశం ఇస్తే ప్రజలు ఓడిపోతారని సీఎం కేసీఆర్ అన్నారు. వాళ్ల పదవుల కోసం, అవకాశాల కోసం పార్టీలు మారి మాటకూడా మార్చేవారు మనమధ్యనే ఉన్నారు. ఏ పార్టీ, ఏ గవర్నమెంట్ ఏం చేసింది.. ప్రజల కోసం ఆలోచించింది.. మళ్లీ మేనిఫెస్టో.. వాగ్ధానం ప్రజల ముందుపెట్టింది ఆలోచించి ఓటు వేయాలి.