తెలంగాణలో బీసీ కుల గణన ఎందుకు చేపట్టడం లేదు.. అమిత్‌షాకు అసద్‌ ప్రశ్న

-

రాష్ట్రానికి బీసీని ముఖ్యమంత్రిని చేస్తామంటున్న హోంశాఖ మంత్రి అమిత్ షా… కుల గణన ఎందుకు చేపట్టడం లేదని మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన.. కేసీఆర్‌కు మద్దతివ్వాలని కోరారు. కాంగ్రెస్, భాజపా.. కవల సోదరుల వంటి పార్టీలని… వారికి బాయ్.. బాయ్ చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. నవంబర్ 30న జరిగే పోలింగ్‌లో మామా కేసీఆర్‌కే ఓటు వేయాలని అసదుద్దీన్‌ విజ్ఞప్తి చేశారు.

“అమిత్‌షా వచ్చి.. తెలంగాణకు బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెబుతున్నారు. బీసీని సీఎం చేస్తామంటున్న మీరు… కుల గణన ఎందుకు చేయడం లేదు. నవంబర్‌ 30న జరిగే ఎన్నికల్లో మామ(కేసీఆర్‌)కు మద్దతివ్వండి. నేను బాధ్యత తీసుకుంటాను. ఎన్నికల్లో మద్దతివ్వండి. మామ(కేసీఆర్‌) మూడోసారి ముఖ్యమంత్రి అవుతారు. ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట అభివృద్ధి జరుగుతుంది. మూడు పార్టీలు పోటీపడుతున్నాయి. నాలుగో పార్టీ మజ్లిస్‌ ఉంది. ప్లవర్‌ ప్లేలో మనమే ఆడుతాం. పవర్‌ ప్లే అంటే తెలుసుగా..? ప్లవర్‌ ప్లే మొదలు పెట్టాం. పవర్‌ మన చేతిలోనే ఉంటుంది.” అని అసదుద్దీన్ అన్నారు

Read more RELATED
Recommended to you

Latest news