బీజేపీకి రాజీనామా చేస్తా.. బాబు మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు

-

తనకు టికెట్ ఇవ్వకపోవడం పై బీజేపీపై ఆ పార్టీ నేత బాబు మోహన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో తన పోటీ చేయదలచుకోవడం లేదని తాను ఎన్నికలతో సహా పార్టీకి దూరంగా ఉండబోతున్నానని తెలిపారు. అధిష్టానం నిర్ణయాన్ని బట్టి పార్టీకి కూడా రాజీనామా చేస్తానని బాబు మోహన్ స్పష్టం చేశారు. తనను తన కొడుకును విడదీసే ప్రయత్నాలు కొందరు చేస్తున్నారని మండిపడ్డారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బీజేపీ నేత బాబు మోహన్ ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు.

సంగారెడ్డి జిల్లాలోని ఆందోల్ నియోజకవర్గం బిజెపి టికెట్ వేరే వాళ్లకు ఇస్తారంటూ ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయొద్దని నిర్ణయించుకున్నాను. ఎన్నికలకు పార్టీకి, పార్టీ ప్రచారాలకు కూడా దూరంగా ఉంటాను. బిజెపి లిస్టులో పేరుతో చేస్తున్న దాపరికం నచ్చలేదు అన్నారు. అధిష్టానం నిర్ణయాన్ని బట్టి పార్టీకి కూడా రాజీనామా చేస్తాను. ముఖ్యంగా సోషల్ మీడియాలో నాకు టికెట్ రాదు అని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. నాకు కాకుండా నా కొడుకుకు టికెట్ ఇస్తున్నారు అంటూ ప్రచారాలు చేస్తున్నారు.

నన్ను, నా కొడుకుని విడదీసే ప్రయత్నాలు చేస్తున్నారు. అనవసరమైన ఊహాగానాలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు బాబు మోహన్. బిజెపి పెద్దలకు ఒకటే చెప్తున్నా మీరు అర్హులైన వారికే టికెట్ ఇచ్చుకోండి. నాకు అవమానాలు చాలా జరిగాయి.నా ఆత్మాభిమానం దెబ్బ తినడం వల్లనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నాకు, నా కొడుకుకు మధ్య పోటీ ఏంటి బిజెపి మొదటి జాబితాలో నా పేరు ప్రకటించకపోవడం వల్లే నాపై తప్పుడు ప్రచారాలు మొదలయ్యాయి.అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్న అని సంచలన వ్యాఖ్యలు చేశారు బాబు మోహన్.

Read more RELATED
Recommended to you

Latest news