ACBకి చిక్కిన రాజన్న సిరిసిల్ల జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ ఉపేందర్‌రావు

-

రాజన్న సిరిసిల్ల జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ ఉపేందర్‌ రావు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్​గా ఏసీబీ అధికారులకు దొరికాడు. అతడిని అదుపులోకి తీసుకున్న అధికారులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అసలేం జరిగిందంటే..?

రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం అడవిపదిర గ్రామానికి చెందిన భూక్య సరితకు సంబంధించి టిప్పర్ వాహనం సబ్సిడీ కోసం ఉపేందర్‌రావును ఆశ్రయించగా… అతను 30 వేలు లంచం డిమాండ్ చేశారు. సరిత మరిది విజయ్ కుమార్ కొద్ది రోజుల క్రితం 17 వేల రూపాయలు లంచంగా ఇచ్చాడు. మిగతా 13వేల రూపాయలు ఇచ్చే ముందు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలోనే విజయ్ కుమార్ ఉపేందర్ కు ఫోన్ చేయగా…ఓ పాఠశాలలో ఎలక్షన్ డ్యూటీ లో ఉన్నాను అక్కడికి రావాలని సూచించారు. దీంతో విజయకుమార్ అక్కడికి వెళ్లి  ఉపేందర్రావుకు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఉపేందర్రావును అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు

Read more RELATED
Recommended to you

Latest news