సీపీఐ, కాంగ్రెస్‌ మధ్య పొత్తు ఖరారు.. నేడే అధికారిక ప్రకటన

-

అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ, కాంగ్రెస్‌ పార్టీల మధ్య పొత్తు ఖరారైంది. కొత్తగూడెం నియోజవర్గం నుంచి సీపీఐ బరిలోకి దిగనుంది. అలాగే ఎన్నికలయ్యాక ఆ పార్టీకి ఒక ఎమ్మెల్సీ పదవి ఇస్తామని.. కాంగ్రెస్‌ తెలిపింది. మునుగోడులో  స్నేహపూర్వక పోటీ ఇస్తామన్న సీపీఐ ప్రతిపాదనకు…. కాంగ్రెస్‌ జాతీయ నాయతక్వం అంగీకరించలేదు. సీపీఐ జాతీయ నాయకత్వం సుముఖత తెలపలేదని తెలుస్తోంది. సీట్ల సర్దుబాటు అంశం కొలిక్కి రావడంతో పొత్తుపై నేడు అధికారిక ప్రకటన చేయాలని ఇరుపార్టీలు నిర్ణయించాయి. సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో పొత్తుపై ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి నుంచి సీపీఐ నేతలకు ఆదివారం సమాచారం అందింది. కొడంగల్‌లో నామినేషన్‌ కార్యక్రమం ముగిసిన తర్వాత సీపీఐ కార్యాలయానికి వస్తానని చెప్పినట్లు సమాచారం. మునుగోడులో స్నేహపూర్వక పోటీ వద్దని… కాంగ్రెస్‌ చెప్పినందున సీపీఐకి ఒక ఎమ్మెల్సీకి బదులు రెండు ఎమ్మెల్సీలు అన్న… ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఆ విషయంపై నేడు స్పష్టత రానుంది. నల్గొండ జిల్లా సీపీఐ రాష్ర్ట కార్యవర్గ సమావేశం మునుగోడులో ఇవాళ నిర్వహించనున్నారు. మునుగోడులో సీపీఐ పోటీ చేయాలని ఆ పార్టీ నేతలు కొద్ది రోజులు నుంచి గట్టిగా పట్టు పడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news