ఏపీ ఆర్టీసీ ఉద్యోగులకు అలర్ట్‌..ఇక అందరికీ జీపీఎస్‌ !

-

ఏపీ ఆర్టీసీ ఉద్యోగులకు అలర్ట్‌.. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జిపిఎస్ (గ్యారంటీడ్ పింఛన్ స్కీమ్)ను ఆర్టిసి ఉద్యోగులకు అమలు చేస్తామని ఏపీఎస్ఆర్టీసీ డైరెక్టర్ ఏ.రాజారెడ్డి తెలిపారు. ‘ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాక కార్మికులందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు.

Implementation of GPS for RTC employees

త్వరలో వారికి జిపిఎస్ ను అమలులోకి తీసుకువస్తాం’ అని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఓపిఎస్ తరహాలో జిపిఎస్ లోను ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని ప్రభుత్వం చెబుతోన్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉండగా… సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి పర్యటనకు ముముర్తం ఫిక్స్‌ అయింది. ఈ నెల 7న అంటే రేపే సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ నగదును రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం వైఎస్‌ జగన్‌.

Read more RELATED
Recommended to you

Latest news