అన్నారం బ్యారేజీ ఖాళీ.. 10 రోజులుగా దిగువకు నీటి విడుదల

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల వ్యవహారం రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తోంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, అన్నారం బ్యారేజీలోని రెండు పియర్ల వద్ద బుంగలు ఏర్పడటం ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ ప్రాజెక్టు భవిష్యత్​పై రాష్ట్ర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం(సరస్వతి) బ్యారేజీలోని గేట్లను ఎత్తివేస్తూ 10 రోజులుగా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ఆ బ్యారేజీలో నీటి నిల్వలు తగ్గిపోయాయి. బ్యారేజీకి సంబంధించి రెండు పియర్ల వద్ద సీపేజీ(బుంగలు) ఏర్పడడంతో ఇంజినీరింగ్‌ అధికారులు అప్రమత్తమై బ్యారేజీని తాత్కాలికంగా కట్టడి చేశారు.

ఇటీవల కేంద్ర జల సంఘం ఉన్నతాధికారులు పరిశీలించగా.. నాలుగు రోజులుగా 10, 8, 7 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఒక్క గేటుకు పరిమితం చేయగా.. దిగువకు స్పల్పంగా ప్రవాహం వెళ్లింది. బ్యారేజీకి ఒక వైపు ఇసుక, రాళ్లు తేలాయి.

Read more RELATED
Recommended to you

Latest news