శ్రీవారి భక్తులకు గుడ్​న్యూస్.. వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శన టికెట్లు విడుదల

-

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించిన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. డిసెంబర్​ 23వ తేదీన వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని వైకుంఠ ఏకాదశి ద్వార దర్శన టికెట్లను విడుదల చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. డిసెంబరు 23వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ వరకు కొనసాగనున్నట్లు వెల్లడించారు.

ఈ వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల(ఎస్‌ఈడీ)ను ఈరోజు ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేసింది. మొత్తం 2.25 లక్షల టికెట్లను ఆన్​లైన్​లో అందుబాటులోకి తీసుకువచ్చింది. భక్తులు ttddevasthanam.ap.gov.in వెబ్​సైట్​లో టికెట్లు బుక్​ చేసుకోవచ్చని టీటీడీ సూచించింది.

మరోవైపు మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. రోజుకు 2 వేల టికెట్ల చొప్పున.. 10 రోజుల పాటు 20 వేల టికెట్లను విడుదల చేస్తామని వెల్లడించారు. సాయంత్రం 5 గంటలకు వసతి గదుల కోటాను అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news