ఢిల్లీ నగరంలో కాలుష్యం ఎందరి పొట్టకొడుతోందో !

-

గత కొంతకాలంగా దేశ రాజధాని ఢిల్లీ లో కాలుష్యం అంచెలంచెలుగా పెరిగిపోతూ ప్రజలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయేంతలా ప్రభావాన్ని చూపిస్తోంది. ఇక ముఖ్యంగా రోజూ కూలికి వెళితేనే పొట్ట నిండే పరిస్థితిలో ఉన్న వారికి ఇంకా దినదిన గండంగా మారిపోయింది. ఢిల్లీ లో కాలుష్యం పెరిగిపోవడంతో నిర్మాణంలో ఉన్న చాలా భావనలు ఆగిపోయాయి. ఈ కారణంగా ఈ పని మీదనే ఆధారపడి పనిచేస్తున్న కూలీలు కనీసం పూత గడవడం కష్టంగా మారుతోంది. ఇందులో భాగంగా రోజు వారీ కూలీగా పని చేస్తున్న మౌర్య అనే వ్యక్తి మాట్లాడుతూ, నేను ప్రతి రోజూ కూలికి వెళ్లి పనిచేయకపోతే మా కుటంబం గడవడం చాలా కష్టం. ఒక రోజుకు నేను రూ. 500 సంపాదిస్తాను, కాలుష్యంతో పని చేయడం చాలా కష్టం..సరిగా ఊపిరి పీల్చుకోవడం కష్టం మరియు కళ్ళు కూడా మండుతూ ఉంటాయి.

అయినప్పటికీ మేము పనికి వెళ్లడం తప్పట్లేదు అంటూ మౌర్య బాధపడ్డాడు. ఇలా రోజువారీ కూలీలు కాలుష్యంతో పనికి వెల్తూ ప్రాణాలను సైతం పోగొట్టుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news