బిటెక్ రవిని చంపేదుకు కుట్రలు : బుద్దా వెంకన్న

-

బీటెక్ రవిని చంపేందుకు కుట్రలు చేస్తున్నారని బుద్ధ వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై పోటీ చేయడమే కాదు రాబోయే ఎన్నికల్లోను మళ్ళీ పోటీకి సిద్ధమవుతున్నాడనే మాజీ ఎమ్మెల్యే బీటెక్ రవిపై కక్షగట్టారని బుద్ధ వెంకన్న అన్నారు. ఈసారి ఎక్కడ పులివెందులలో ఓడిపోతానో అనే భయం జగన్ కు పట్టుకుందని, అందువల్లే బీటెక్ రవిపై కుట్రలు చేస్తున్నాడని ఆరోపించారు.

budda comments on btec ravi
budda comments on btec ravi

అరెస్టు కాదు రవిని చంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ బుద్ధ వెంకన్న సంచలన వాక్యాలు చేశారు. ప్రస్తుతం పులివెందుల ఇన్చార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవి టిడిపిని బలోపేతం చేసుకుంటున్నారని వెంకన్న అన్నారు. ఇది ఇలాగే కొనసాగితే ఎన్నికల నాటికి తనను ఓడించే స్థాయికి టిడిపి బలపడుతుందని జగన్ కు అర్థమైంది….అందువల్లే రవిని అరెస్టు చేయించారని అన్నారు. ఇలా అరెస్టులకు భయపడే రకం కాదు రవి… అందువల్లే అతడిని చంపేందుకు సిద్ధమయ్యారని వెంకన్న అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news