రూ. 460 కోట్లు ఏపీ ప్రభుత్వం వేరే స్కీమ్ లకు తరలించింది – బాలయ్య

-

రూ. 460 కోట్లు ఏపీ ప్రభుత్వం వేరే స్కీమ్ లకు తరలించిందని ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే బాలకృష్ణ. హిందూపురం ప్రభుత్వ ఆస్పుత్రిని సందర్శించిన ఎమ్మెల్యే బాలకృష్ణ…ఆస్పత్రిలో సౌకర్యాలు ఎలా ఉన్నాయని రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో సరైన సౌకర్యాలు లేవని బాలకృష్ణకు ఫిర్యాదు చేశారు రోగులు.

Balayya twirled his mustache in the assembly
Balayya twirled his mustache in the assembly

అనంతరం ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ….హిందూపురం ప్రభుత్వ ఆస్పుత్రిలో అనేక సమస్యలు ఉన్నాయి…వైద్య పరికరాలు లేవు, ఉన్న వాటిని వాడుకోలేదన్నారు. గతంలో నేను ఇచ్చిన వెంటిలేటర్లు నిరుపయోగంగా ఉన్నాయని..టీడీపీ హయాంలో ఆస్పత్రి శుభ్రంగా ఉండేది… ఇప్పుడు అలా లేదని వివరించారు. ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తామని ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యాలు అంటున్నాయని…ఏపీకి కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ కింద ఇచ్చిన నిధులను కూడా వేరే స్కీమ్ లకు డైవర్ట్ చేశారని ఆరోపించారు. 460 కోట్లు రూపాయలను ఏపీ ప్రభుత్వం వేరే స్కీమ్ లకు తరలించింది…దానికి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఫైన్ కూడా కట్టిందని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news