Ahimsa Movie : OTTలోకి వచ్చిన ‘అహింస’..9 నెలల తర్వాత !

-

టాలీవుడ్ సూపర్ హిట్ ప్రొడ్యూసర్, ఎస్పీ ప్రొడక్షన్స్ అధినేత సురేశ్ బాబు రెండో తనయుడు అభిరామ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేశాడు. తేజ దర్శకత్వంలో అహింస మూవీతో అభి టాలీవుడ్ లో అరంగేట్రం చేశాడు. అయితే..నటుడు దగ్గుబాటి రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ హీరోగా నటించిన ‘అహింస’ మూవీ ఓటీటీలోకి వచ్చింది.

Ahimsa OTT Streaming Details
Ahimsa OTT Streaming Details

అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. కాగా, ఈ చిత్రం విడుదలై దాదాపు 6 నెలలు అవుతోంది. ఇప్పటికే టీవీల్లో కూడా ప్రసారమైంది. కానీ ఇప్పుడు ఓటిటిలో విడుదల చేశారు. అభిరామ్ సరసన గీతిక తివారి హీరోయిన్ గా నటించారు. డైరెక్టర్ తేజ తెరకెక్కించారు. ఆర్పి పట్నాయక్ సంగీతం అందించారు. ఇది ఇలా ఉండగా.. టాలీవుడ్ వివాదాస్పద నటి శ్రీరెడ్డి.. అహింస సినిమా పై సంచలన వ్యాఖ్యలు చేసింది. అహింస సినిమా అట్టర్ ప్లాప్ అయిందంటూ పోస్ట్ పెట్టింది శ్రీ రెడ్డి. హింసతో మమ్మల్ని చంపకండి అంటూ… హీరో అభిరామ్ ను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేసింది. తేజ డైరెక్షన్ అస్సలు బాగా లేదంటూ మండిపడింది శ్రీ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news