ఓలా, ఉబర్​కు పోటీగా ర్యాపిడో క్యాబ్ సేవలు ప్రారంభం

-

ర్యాపిడో.. ఈ పేరు తెలియని వారుండరు. సొంత వాహనాలు లేని వారు.. ఎక్కడికైనా ఒక్కరే వెళ్లాలంటే క్యాబ్​ను బుక్ చేసుకుంటారు. కానీ ఒక్కరి కోసం క్యాబ్ అనవసరం అనుకునే వారు ర్యాపిడో బైక్స్​కు జై కొట్టేవారు. ఇండియాలో ర్యాపిడోను ఎక్కువగా యువకులే వినియోగిస్తున్నారు. అయితే ఇన్నాళ్లూ కేవలం బైక్ రైడ్స్ అందించిన ర్యాపిడో ఇప్పుడు తమ సేవలు విస్తరించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే క్యాబ్ సేవలు కూడా ప్రారంభించాలని నిర్ణయించింది.

అనుకున్నట్లుగానే ఇండియాలో ర్యాపిడ్ క్యాబ్ సేవల విభాగంలోకి అడుగుపెట్టింది. ఓలా, ఉబర్ వంటి సంస్థలతో ఇక నుంచి ర్యాపిడో కూడా పోటీ పడనుంది. దిల్లీ- ఎన్‌సీఆర్‌, హైదరాబాద్‌, బెంగళూరు నగరాల్లో దాదాపు 1.2 లక్షల క్యాబ్‌లతో సేవలు ప్రారంభించినట్లు ర్యాపిడో తెలిపింది. 2024 సెప్టెంబరుకు వీటిని 35 నగరాలకు విస్తరిస్తామని ఆ సంస్థ సహవ్యవస్థాపకుడు పవన్‌ గుంటుపల్లి వెల్లడించారు. ఎక్కువ మంది ప్రజలకు యాప్‌ ఆధారిత సేవలు అందించి, మార్కెట్‌ విస్తరించుకోవడమే తమ లక్ష్యమని పవన్ గుంటుపల్లి వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news