లక్ష మందితో రేవంత్‌ ప్రమాణ స్వీకారం – మల్లు రవి

-

లక్ష మందితో రేవంత్‌ ప్రమాణ స్వీకారం చేస్తామని ప్రకటించారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లు రవి. ఎల్ బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి ప్రమాణం స్వీకారోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, డీజిపీలతో పాటు ఇతర శాఖల అధికారులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. సుమారు లక్ష మంది ప్రమాణం స్వీకారోత్సవానికి తరలి వచ్చే అవకాశం ఉందని వివరంచారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లు రవి.

Senior Congress leaders Mallu Ravi comments on revanth

ప్రమాణ స్వీకారోత్సవానికి సోనియా, రాహూల్, ఖర్గేలతో పాటు ఇండియా కూటమి అధికారులు హాజరవుతారన్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి జనాలను సమీకరించడం లేదు, స్వచ్ఛదంగానే తరలివస్తారని చెప్పారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లు రవి. తూర్పు వైపుగా స్టేడియం ఏర్పాటు చేస్తున్నామన్నారు. లోపలికి గేట్ నెంబర్ ఎనిమిది నుంచి రేవంత్ లోపలికి వస్తారన్నారు. స్టేడియం లోపల జీపులో తిరుగుతూ జనాలకు అభివాదం చేస్తారని చెప్పారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లు రవి.

Read more RELATED
Recommended to you

Latest news