BREAKING : సీఎంతో పాటు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రులు వీరే

-

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి మరికొన్ని గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 1.04 గంటలకు నగరంలోని ఎల్బీ స్టేడియంలో ఈ కార్యక్రమం ఘనంగా జరగనుంది. ఇప్పటికే అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. అయితే సీఎంతో పాటు పదకొండు మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం.

రేవంత్ రెడ్డితో పాటు ఇవాళ మంత్రులుగా భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, సీతక్క, శ్రీధర్‌ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనరసింహ, సుదర్శన్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర రావు, కొండా సురేఖ ప్రమాణస్వీకారం చేయనున్నారు. మంత్రుల జాబితాలో ఉన్నవారికి రేవంత్‌ రెడ్డి  ఫోన్లు చేసి సమాచారం అందిస్తున్నారు. మరోవైపు తెలంగాణ కేబినెట్​లో చోటు కల్పించిన మంత్రుల జాబితాను రాజ్ భవన్​కు కాంగ్రెస్ నేతలు అందించారు.

మరోవైపు ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్‌ అగ్రనేతలతో పాటు ఆ పార్టీకి చెందిన ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ముఖ్యనేతలు ఒక్కొక్కరుగా రాష్ట్రానికి చేరుకుంటున్నారు. వారికి రేవంత్ రెడ్డితో పాటు పార్టీ కీలక నేతలు ఎయిర్​పోర్టులో స్వాగతం పలుకుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news