రాజకీయాల మీద బండ్ల గణేష్ కు ఉన్న కమిట్మెంట్ కూడా పవన్ కళ్యాణ్ కు లేదని ఎద్దేవా చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. అత్తారింటికి దారేది అంటే పవన్ కళ్యాణ్ మూడు దారులు వెతుక్కోవాలని చురకలు అంటించారు. జనసేన కంటే బర్రెలక్క బెటర్ అంటూ ఎద్దేవా చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. పొలిటికల్ కాంట్రాక్ట్ కోసం పుట్టిన పార్టీ జనసేన….తెలంగాణ ఫలితాల తర్వాత జనసేనకు తగిలిన దెబ్బకు మతి చలించినట్టు కనిపిస్తోందని పేర్కొన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్.
స్థాయిని మరిచి అబ్రహం లింకన్ గురించి కాదు చంద్రబాబుతో ఉన్న లింకులు గురించి పవన్ మాట్లాడితే మంచిది…ఓట్లను సాధించడంతో బర్రెలక్కతో జనసేన పోటీపడింది, డిపాజిట్లు కూడా రాలేదని చురకలు అంటించారు. జగన్మోహన్ రెడ్డిని విమర్శలు చేయడానికే పరిమితం అనే పవన్ కళ్యాణ్ తీరును ఖండిస్తున్నాం…తెలంగాణలో స్థిర నివాసం వుండే మీ బలం ఏంటో తెలంగాణ ఎన్నికల్లో తేలిపోయిందని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ ఏ నియోజక వర్గమో పవన్ కళ్యాణ్ చెప్పాలి…? అని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీని నాశనం చేశాడు….ఏపీలో ఏం జరగబోతుందో చూద్ధామని ఎద్దేవా చేశారు. ఏపీలో 2019 ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయని స్ఫష్టం చేశారు.