కేసీఆర్‌ కోసం స్పెషల్‌ ఆఫీసర్‌ ను పంపిన రేవంత్‌ రెడ్డి

-

CM Revanth Reddy : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న రాత్రి ఆయన ఇంట్లో కాలుజారి పడటంతో తుంటి ఎముక విరిగి గాయమైనట్లు సమాచారం. దీంతో గురువారం అర్ధరాత్రి సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో ఆయన్ను చేర్చారు. ప్రస్తుతం యశోద ఆస్పత్రిలో కేసీఆర్‌కు చికిత్స అందిస్తున్నారు. ఇలాంటి తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు యశోద హాస్పిటల్ కు వెళ్లారు ఆరోగ్యశాఖ కార్యదర్శి.

యశోద ఆసుపత్రి వైద్యులను అడిగి కెసిఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు వైద్యాధికారులు. మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని హెల్త్ సెక్రటరీ కి చెప్పారు యశోద వైద్యులు. కెసిఆర్ కు మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. నిన్న కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసిన వెంటనే వెంటనే స్పందించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ క్లియరెన్స్ తో ఆసుపత్రికి తరలించారు పోలీస్ అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news