BREAKING : హైదరాబాద్ లో మరో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ పరిధి మైలార్ దేవ్ పల్లి లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. టాటా నగర్ లోని ఓ ప్లాస్టిక్ గోదామ్ లో మంటలు ఒక్క సారిగా చెలరేగాయి. ఈ మంటలకు తోడు దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు…ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
ఈ తరుణంలోనే.. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది… మంటలు ఆర్పే పనిలో పడింది. నాలుగు ఫైర్ ఇంజిన్ల సహాయం తో మంటలను అదుపు చేసింది అగ్నిమాపక సిబ్బంది. నిబంధనలకు విరుద్దంగా యాజమాన్యం…పరిశ్రమ నడుపుతోందని అధికారులు గుర్తించారు. అయితే..అగ్ని ప్రమా దం జరిగిన సమయంలో పరిశ్రమలో ఎవ్వరూ లేకపోవడంతో ప్రాణ నష్టం…తప్పింది. నాలుగు గంటలు శ్రమించి మంటలను అదుపు చేసింది అగ్నిమాపక సిబ్బంది. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియా ల్సి ఉంది.